పదేళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు...
- IndiaGlitz, [Thursday,March 10 2016]
పలు హిట్ చిత్రాల్లో నటించిన సూర్య, జ్యోతిక హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు. ఒకింటివారయ్యారు కూడా. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చివరి చిత్రం నువ్వు నేను ప్రేమ. ఈ సినిమా విడుదలై దశాబ్దకాలం దాటింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. తమిళ దర్శకుడు బ్రహ్మ జి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈ జోడి సందడి చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కచ్చితంగా వీరిద్దరు కలిసి నటిస్తారనే వార్త అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తించింది.