‘ఆచార్య’ కథపై స్పందించిన చిత్ర యూనిట్..
- IndiaGlitz, [Thursday,August 27 2020]
‘ఆచార్య’ కథ కాపీ అంటూ వస్తున్న ఆరోపణలపై చిత్ర యూనిట్ స్పందించింది. నేడు అధికారికంగా ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మోషన్ పోస్టర్‌లో చూపించిన సన్నివేశం తను రాసుకున్న కథలోనిదేనంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత ఆరోపించారు.
‘ఆచార్య’ మోషన్ పోస్టర్‌లో చూపించిన కథను ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించినట్టు అనిల్ కృష్ణ తెలిపారు.
‘ఆచార్య’ కథ కాపీ అంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించిన చిత్ర యూనిట్.. సినిమా ఒరిజినల్ కథ, కాన్సెప్ట్.. దర్శకుడు కొరటాల శివకు మాత్రమే చెందుతుందని వెల్లడించింది. ఈ కథపై వస్తున్న కాపీ ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపడేసింది. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌కు అన్నీ వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని పేర్కొంది. ఈ సినిమాకు వచ్చిన హైప్ చూసి కొందరు రైటర్స్ ‘ఆచార్య’ సినిమా కథ తమదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. సినిమా చిత్రీకరణ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచామని వెల్లడించింది. చాలా తక్కువ మందికి మాత్రమే కథ గురించిన అవగాహన ఉందని చిత్ర యూనిట్ తెలిపింది.
కేవలం మోషన్ పోస్టర్‌ను చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని పేర్కొంది. అందరికీ చెప్పాలనుకున్న విషయమొకటేనని.. ‘ఆచార్య’ కథ ఒరిజినల్ అని స్పష్టం చేసింది. కొరటాల శివలాంటి పేరున్న దర్శకులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని చిత్ర యూనిట్ పేర్కొంది. కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య’ సినిమా గురించి వస్తున్న రూమర్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. ఈ కథ కోసం మెగాస్టార్‌తో కొరటాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారని తెలిపింది. ఆయన ఇమేజ్‌కు తగినట్లు పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా ‘ఆచార్య’ సినిమా కథను సిద్ధం చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది.