'ఆచార్య' టీజర్ వస్తుందనుకుంటే అప్డేట్ ఇచ్చారు
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎస్. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ‘ఆచార్య’ టీజర్ వచ్చేస్తుందని భావించిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంగళవారం చిరు, కొరటాల మధ్య జరిగిన సంభాషణతో నేడు టీజర్ వచ్చేస్తుందని అంతా భావించారు. అయితే టీజర్ ఎప్పుడు వస్తుందనే అప్డేట్ మాత్రం ఇచ్చారు.
కానీ టీజర్ రాలేదు.. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది. ఈ నెల 29న సాయంత్రం 4:05 గంటలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకోబోతున్నాయంటూ వీడియోలో వెల్లడించారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చెర్రీ కూడా షూటింగ్లో పాల్గొంటున్నాడు. చెర్రీ కోసం కొరటాల ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ధర్మస్థలి అనే గ్రామం వేదికగా కథ నడుస్తుందని తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments