‘ఆచార్య’తో కలిసి సిద్ద... సర్ప్రైజ్ అదిరిపోయిందిగా..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్‌ను అందజేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సిద్ద అనే పాత్రలో ఈ సినిమాలో చెర్రీ మెప్పించనున్నాడు. ఆయన పాత్ర నిడివి పూర్తి స్థాయిలో ఉండక పోయినా.. సినిమాను మలుపు తిప్పేది మాత్రం చెర్రీయేనని తెలుస్తోంది. నక్సలైట్ నాయకుడిగా ఈ చిత్రంలో చెర్రీ నటిస్తున్నాడు. తండ్రీకొడుకులు కలిసి గతంలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నప్పటికీ ఇలా చెర్రీ తన తండ్రి సినిమాలో ఒక కీ రోల్‌ను పోషించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.
నిజానికి మెగాస్టార్, చెర్రీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్ర యూనిట్ విడుదల చేసిన సర్ప్రైజ్ అదిరిపోయింది. తండ్రీకొడుకులు మెగాస్టార్, చెర్రీ కలిసి తుపాకులు పట్టుకుని ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న పోస్టర్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌గా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇద్దరి లుక్స్, గెటప్ సేమ్ టు సేమ్ ఉంది. దీనిని చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ఈ మూవీ ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. మ్యాట్నీ మూవీస్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
కాగా నిన్న ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కూడా చెర్రీ బర్త్‌డే సర్ప్రైజ్ను విడుదల చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కాగా.. నిన్న ఈ చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఒక అద్భుతమనే చెప్పాలి. అభిమానులను ఓ రేంజ్లో ఆకట్టుకుంది. ‘ధైర్యానికి చిహ్నం... గౌరవానికి నిర్వచనం... చిత్తశుద్ధితో నిలబడే వ్యక్తిత్వం... వీరోచిత అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం పేర్కొంది. ‘‘ధైర్యం, గౌరవం, సమగ్రత గల వ్యక్తి. నా అల్లూరి’’ అని రాజమౌళి పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments