‘ఆచార్య’ రిలీజ్ డేట్ అప్పుడేనా?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య‌’తో అయినా 2020లో బాక్సాఫీస్ వ్ద‌ద సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని మెగాస్టార్ భావించారు. కానీ క‌రోనా వైర‌స్ మెగా స్పీడుకి బ్రేకులేసింది. ‘ఆచార్య‌’ విడుద‌ల ఈ ఏడాది లేదు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు ‘ఆచార్య‌’ విడుద‌ల తేదీపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు షికార్లు చేస్తున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ‘ఆచార్య‌’ను వచ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తారు. అందులో భాగంగా ఏప్రిల్ 9న ‘ఆచార్య’ను విడుద‌ల చేస్తార‌ని స‌మాచారం. ఏప్రిల్ 9న చిరంజీవిగారి సినిమాల్లో రెండు కెరీర్ భారీ హిట్స్ ఉన్నాయి. అందులో ఒక‌టి ‘గ్యాంగ్ లీడ‌ర్’.. ఇండ‌స్ట్రీ హిట్, ‘బావ‌గారూ బాగున్నారా’ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌... ఈ రెండు సినిమాలు విడుదలైన రోజునే ‘ఆచార్య‌’ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఈ సినిమా షూటింగ్ ఆగింది. ప‌రిస్థితులు కంట్రోల్ అయ్యాక ఏమాత్రం ఆల‌స్యం లేకుండా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌. ఈ చిత్రంలో చిరంజీవి న‌క్స‌లైట్ పాత్ర‌లో క‌నిపిస్తారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో కనిపించ‌నున్నారు.