ఆచార్య రిలీజ్ డేట్ ఛేంజ్ వెనుక పక్కా వ్యూహం..!!!
- IndiaGlitz, [Sunday,October 10 2021]
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంభినేషన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు స్వయంగా చిరు ట్వీట్ చేశారు. ఈపాటికే విడుదలవ్వాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో చకాచకా చిత్రీకరణను కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే మూవీ రిలీజ్ డేట్‌పై ఇప్పటి వరకు సస్పెన్స్ నెలకొంది. మొదట ఆచార్యను డిసెంబర్ 24న కొరటాల శివ విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రామ్‌చరణ్- ఎన్టీఆర్‌ల ఆర్‌ఆర్‌ఆర్ జనవరి 7న విడుదలవుతుండటంతో ఆచార్య రిలీజ్‌ను వాయిదా వేశారు.
దీంతో డిసెంబర్ 17 ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే అదే రోజున సుకుమార్- అల్లు అర్జున్‌ల పుష్ప రిలీజ్ కావడంతో ఆచార్య విడుదల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇక దీనిపై చర్చ జరిపిన మూవీ టీం తాజాగా ఫిబ్రవరి 4ని ఖరారు చేసి ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ వాయిదా పడటం వెనుక ఇంకా చాలా కారణాలు వున్నాయని ఫిలింనగర్ టాక్.
కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు కుటుంబంతో కలిసి థియేటర్లకు వస్తున్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమా విడుదలై ఈ లెక్కలన్నీ మార్చే అవకాశం ఉందని నమ్ముతున్నారు సనీ జనాలు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తరువాత ‘ఆచార్య’ రిలీజ్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందని కొందరు చిత్ర బృందానికి సలహాలు ఇచ్చారట.
అలానే రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు అంత తక్కువ గ్యాప్ లో విడుదలవ్వడం మంచిది కాదని కొందరు హెచ్చరించారట. ఈ ఫీడ్ బ్యాక్‌తో పాటు మరికొన్ని అంశాలను బేరీజు వేసుకున్న చిరంజీవి తన సినిమాను డిసెంబర్ 17 కాకుండా ఫిబ్రవరి 4కి వాయిదా వేయాలని డిసైడ్ అయ్యార. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్యలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూజాహెగ్డే కీలక పాత్రలో కనిపించనున్నారు.