షూటింగ్ పూర్తికాక ముందే రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఆచార్య’
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఒక రికార్డును నమోదు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో ‘ఆచార్య’ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం తాజాగా కోకాపేటలో టెంపుల్ టౌన్ సెట్ వేశారు. ఇప్పుడు ఈ టెంపుల్ టౌన్ రికార్డ్ సృష్టించింది. దీని ప్రత్యేకత ఏంటంటే... దీని నిర్మాణం 20 ఎకరాల్లో జరిగింది. మన దేశంలోనే ఒక సినిమా కోసం ఇన్ని ఎకరాల్లో సెట్ వేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ సినిమా సెట్ రికార్డులకెక్కింది. కాగా.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే చిరు వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేశారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం చిరంజీవి సోలో సన్నివేశాలను మాత్రమే చిత్రబృందం తెరకెక్కిస్తోంది. తరువాత రామ్ చరణ్ కూడా సెట్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. కరోనా నుంచి చెర్రీ కోలుకోగానే షూటింగ్‌లో పాల్గొననున్నాడు. అంటే సంక్రాంతికి చెర్రీ ‘ఆచార్య’ సెట్‌లో ఉండే అవకాశం ఉందని సమాచారం. చెర్రీ నెల పాటు ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీపై ఓ పాటను కూడా చిత్రబృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నెల ద్వితీయార్థం నుంచి వచ్చే నెలలో కూడా కొద్ది రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో చెర్రీ పాల్గొంటాడని సమాచారం.
తండ్రీకొడుకులు ఒక సినిమాలో కనిపించడమనేది కొత్తేం కాదు కానీ.. ఇలా తండ్రి సినిమాలో చెర్రీ ఒక కీలక పాత్రను పోషించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కొరటాల శివ మరో సందేశాన్ని ఈ సారి మెగాస్టార్ ద్వారా చెప్పించనున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం వేసవి కానుకగా.. మేలో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout