‘ఆచార్య’ కాపీ రైట్ ఇష్యూ!!
- IndiaGlitz, [Monday,August 24 2020]
పలానా స్టార్ హీరో కథ నాదంటూ..మరొకరు గొంతెత్తడం ఈ మధ్య కామన్‌గా జరుగుతున్న విషయం. లేటెస్ట్‌గా ‘ఆచార్య’ విషయంలో కాపీ రైట్ సమస్య మొదలైంది. అనీల్ కన్నెంటి అనే రైటర్, డైరెక్టర్ ‘ఆచార్య’ కథ తనదంటూ ఆరోపణలు చేస్తున్నారు. 2006లో ‘పుణ్యభూమి’ అనే కథను రాసుకుని రైటర్స్ అసోసియేషన్‌లో రిజిష్టర్ చేయించానని, ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ చూస్తుంటే తన కథను కాపీ కొట్టినట్లు అనిపిస్తుందని అనీల్ ఆరోపణలు చేస్తున్నారు. అసలు అనీల్ పేరు కోసం ఇలాంటి ఆరోపణలు చే్స్తున్నాడా? మరేదైనా కారణమా? అని తెలియాలంటే ‘ఆచార్య’ టీమ్ స్పందించాల్సిందే
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి నక్సలైట్‌గా, దేవాదాయ శాఖాధికారిగా కనిపించనున్నారని టాక్. అలాగే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇందులో నక్సలైట్‌గా మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిన ‘ఆచార్య’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.