‘ఆచార్య‌’కు మరో క్రేజీ డీల్..!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. చిరంజీవి 152వ చిత్ర‌మిది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా మే 13న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు బిజినెస్ క్రేజ్ నెల‌కొంది. ఇప్ప‌టికే ఆచార్య సినిమా నైజాం హ‌క్కుల‌ను రూ.40 కోట్ల‌కు నిర్మాత‌లు సేల్ చేసినట్లు వార్త‌లు వినిపించాయి. మిగిలిన ఏరియాలకు కూడా క్రేజీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు, ఆచార్య సినిమా హ‌క్కులు రూ.11 కోట్లకు అమ్ముడైన‌ట్లు స‌మాచారం. ప్యాండ‌మిక్ త‌ర్వాత ఓవ‌ర్‌సీస్‌లో ఇంత భారీ మొత్తంలో బిజినెస్ జ‌ర‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం. మెగాస్టార్ ఇమేజ్‌.. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ వ‌రుస స‌క్సెస్‌ల ఇమేజ్ క‌లిసి ఉండ‌టంతో సినిమాపై భారీ క్రేజ్ నెల‌కొంది. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. మ‌ణిశ‌ర్మ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు

More News

బ‌న్నీకి నేను పెద్ద ఫ్యాన్ అంటున్న బాలీవుడ్ హీరోయిన్‌..

తొలి చిత్రం ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌తో న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకున్న బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్‌.

రెడ్ లైట్ ఏరియాకు వెళ్లిన హీరోయిన్‌...!

ముంబైలో రెడ్‌లైట్ ఏరియా గురించి పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అక్క‌డ కామాటిపుర ఏరియా వ్య‌భిచారానికి కేరాఫ్ అడ్ర‌స్‌.

అంగారకుడిపైకి వెళ్లడం ఇప్పుడిక మరింత సులువు..

అంగారకుడిపైకి వెళ్లడం ఇక మీదట మరింత సులువుతో పాటు మరొక విశేషం కూడా ఉంది.

ఆదిలాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎం మిషన్‌నే లేపేశారు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్‌ చౌక్‌లో చోటుచేసుకుంది.

‘లూసిఫర్’ రీమేక్‌లో మార్పులు ఇవేనట..

మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్టర్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌‌లో మెగాస్టార్ చిరంజీవి  నటించనున్న విషయం తెలిసిందే.