మళ్ళీ వాయిదా పడ్డ 'ఆచారి అమెరికా యాత్ర'?
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడు మంచు విష్ణు, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘దేనికైనా రెడీ’, ‘ఈడో రకం ఆడో రకం’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కలయికలో ముచ్చటగా మూడోసారి ‘ఆచారి అమెరికా యాత్ర’ పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా.. కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రహ్మానందం కథకు కీలకమైన పాత్రలో సందడి చేయనున్నారు.
పద్మజ పిక్చర్స్ బ్యానర్‌పై కీర్తి చౌదరి, ఎం.ఎల్.కుమార్ నిర్మించిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ విడుదలకు ముందే మంచి బజ్‌ను సాధించింది. అయితే.. కొన్ని కారణాల వల్ల జనవరి 26న విడుదల కావలసిన ఈ సినిమా ఈ నెల 6వ తేదీకి వాయిదా పడింది. కాని తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం మరోసారి వాయిదా పడిందని.. ఈ నెల 26న విడుదలకు సిద్ధం కాబోతోందని తెలుస్తోంది. మరి ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మూడోసారైనా సరైన సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందో, లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments