ఏస్ డైరక్టర్ నిర్మాతల్ని మార్చేస్తున్నారు
Send us your feedback to audioarticles@vaarta.com
మణిరత్నం తాజా సినిమా `పొన్నియిన్ సెల్వన్` మరో సారి మార్పులు, చేర్పులకు గురి కానుందా? కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అదే జరిగేట్టు ఉంది. ఈ సినిమాను గతంలో మహేష్‌బాబు, విజయ్ ప్రధాన పాత్రలుగా తీయాలని మణి సంక్పలించారు. అప్పట్లో ఈ సినిమా వర్కవుట్ కాలేదు. `నవాబ్` మల్టీస్టారర్ ఇచ్చిన ధైర్యంతో మళ్లీ మణి ఈ ప్రాజెక్ట్ ను వేగవంతం చేశారు.ఈ సారి స్టార్లు అమితాబ్, మోహన్‌బాబు పేర్లు కూడా కాస్టింగ్ లిస్ట్ లో ఉన్నాయి.
కార్తి, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, ఐశ్వర్య రాయ్‌తో పాటు ఎంతో మందిని ఈ సినిమాలోని పాత్రల కోసం కలిసి ఒప్పించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మణిరత్నం మెడ్రాస్ టాకీస్‌పై చేయాలనుకున్నారు. కానీ ఇటీవల శంకర్ సినిమా `2.0` పెద్దగా ఆడలేదు. సో లైకా ఇప్పుడు `పొన్నియిన్ సెల్వన్` చిత్రానికి అంత బడ్జెట్ పెట్టగలదా? అనే అనుమానం మణి మనసులో పడిందట. అందుకే వారికి బదులు రిలయన్స్ వాళ్లను కన్సల్ట్ చేస్తున్నారట. రిలయన్స్ తో డీల్ ఓకే అయితే, విడుదల వరకు ఎలాంటి చీకూ చింతన లేకుండా సినిమా మీద దృష్టి పెట్టొచ్చని మణి మనోభావమని గుసగుస.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout