కీసర తహసీల్దార్‌ను మించిన అవినీతి తిమింగళం దొరికింది..
Send us your feedback to audioarticles@vaarta.com
25 రోజుల తేడాతోనే రెండు భారీ అవినీతి తిమింగళాలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. అయితే కీసరలో పట్టుబడ్డ అవినీతి తిమింగళాన్ని తాజాగా చిక్కిన తిమింగళం క్రాస్ చేయడం విశేషం. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అసలు విషయంలోకి వెళితే.. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామానికి చెందిన రైతు మూర్తికి చెందిన పొలానికి సంబంధించిన ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. దీంతో మూర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
డీఎస్పీ సూర్య నారాయణ ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్ నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో లంచం విషయంలో చేసుకున్న అగ్రిమెంట్, నగేష్ ఇంట్లో బ్లాంక్ చెక్కులు, అగ్రిమెంట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే లంచం తీసుకోవడంలో కీసర ఎమ్మార్వోను అడిషనల్ కలెక్టర్ క్రాస్ చేయడం విశేషం. అయితే నగేష్ ఇంట్లో సోదాలు సాయంత్రం వరకూ కొనసాగనున్నాయి. అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు, ఆర్డీవో అరుణ, నరసాపూర్ తహశీల్దార్ మాలతి, వీఆర్ఓ, వీఆర్ఏల అందరి ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అయితే ఉప్పల్‌లోని ఆర్డీవో అరుణ ఇంట్లో రూ.20 లక్షల బంగారం, నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగేష్ భార్యను కొంపల్లిలోని తన నివాసానికి ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. మరికొద్ది సేపట్లో నగేష్ బ్యాంక్ లాకర్‌ను కూడా తెరిచే అవకాశం ఉంది. మొత్తం మీద 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం 25 రోజుల వ్యవధిలోనే కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం ఇది రెండోసారి కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments