Chandrababu:జైల్లో చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు తరపు న్యాయవాదులు శనివారం రాత్రి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చల్లని వాతావరణం ఉండేలా చూడాలని ప్రభుత్వ వైద్యులు చేసిన సూచనను పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి తక్షణమే చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు..
అంతకుముందు జైల్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన వైద్యులు చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ ఆయన శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఉన్నతాధికారులకు సూచిస్తామన్నారు. ప్రస్తుతానికి ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందని.. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులను సంప్రదించిన తర్వాతే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామని వెల్లడించారు. ఆయన యాక్టివ్గా ఉన్నారని తమతో మామూలుగానే మాట్లాడారని చెప్పారు. జైలుకు రాకముందు ఆయన ఆరోగ్య పరిస్థితి రికార్డ్స్ ఏంటో తమకు తెలియదని వివరించారు.
జైలులో వాతావరణం భిన్నంగా ఉంటుంది..
అనంతరం మీడియాతో మాట్లాడిన డీఐజీ రవికిరణ్ రెడ్డి.. వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతామని రవికిరణ్ తెలిపారు. చంద్రబాబు హైప్రొఫైల్ ప్రిజనరీ అని ఆయనను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు. 24 గంటలు అధికారులు ఆయన ఆరోగ్యం పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారని.. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఇంటి వద్ద ఉండే వాతావరణానికి జైలులో వాతావరణం భిన్నంగా ఉంటుందని డీఐజీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout