అబుదాబి టు ఆర్‌ఎఫ్‌సి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సాహో’ చిత్రం ఇటీవల దుబాయ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అబుదాబిలో భారీ యాక్షన్, చేజ్ సీన్స్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. జూన్ రెండో వారంలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది ‘సాహో’ యూనిట్. ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించనున్నారు.
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com