దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. 45వేల మందికి పైగా మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 50 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కరోనాతో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా మృతి చెందారు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 53,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22,68,675కు చేరుకుంది.
తాజాగా కరోనాతో 871 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 45,257 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 6,39,929 యాక్టివ్ కేసులున్నాయి. 15,83,489 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 47,746 బాధితులు కోలుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 69.80% ఉండగా.. మరణాల రేటు 1.99% ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout