గోపీచంద్ టైటిల్ గురించి....

  • IndiaGlitz, [Monday,September 12 2016]

డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్క‌నుంది.

రీసెంట్‌గా సినిమా ప్రారంభం అయ్యింది. అయితే శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై 'గౌత‌మ్‌నంద', 'తోపు' అనే టైటిల్స్ రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. మ‌రి ఈ రెండు టైటిల్స్‌లో ఏది ఫిక్స్ చేస్తారో చూడాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే..