సినిమాల్లోకి హీరోయిన్ కుమారుడు

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు ఇటా స్టార్స్‌తో న‌టించిన హీరోయిన్ సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను వివాహం చేసుకుని సెటిలైంది. తెలుగునాట జ‌రిగే వేడుక‌ల‌కు వ‌స్తూ ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే త‌ల్లి, వ‌దిన‌, అక్క పాత్ర‌లు కూడా చేసింది. ఇప్పుడు అస‌లు విష‌యంలోకి వెళితే..న‌టులుగా అంబ‌రీష్‌, సుమల‌త‌కు కన్న‌డంలో చాలా మంచి పేరుంది.

కాబ‌ట్టి వీరు త‌మ త‌న‌యుడు అభిషేక్ సినీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. కొన్ని రోజులుగా అభిషేక్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ప‌వ‌న్ వ‌డియార్ లేదా సంతోష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

మ‌రి సినిమాను క‌న్న‌డ‌తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల చేస్తారా? లేక అభిషేక్‌ను తెలుగులో స‌ప‌రేట్‌గా వేరే సినిమాతో ఎమైనా ఇంట్ర‌డ్యూస్ చేస్తారా? అని చూడాలి.

More News

'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' సక్సెస్‌ టూర్‌

సప్తగిరి హీరోగా సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రతం సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.

రెగ్యులర్‌ షూటింగ్‌లో సాయిధరమ్‌తేజ్‌ చిత్రం

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

డిసెంబ‌ర్ 15న 'ఇదీ మా ప్రేమ‌క‌థ‌'

యాంకర్ రవి హీరోగా పరిచమవుతున్న  చిత్రం 'ఇది మా ప్రేమ కథ'. 'శశిరేఖా పరిణయం' సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది.

నాని,విక్ర‌మ్ కుమార్ మూవీ డిటైల్స్‌

వరుసగా ఆరు విజయాలను అందుకుని డబుల్ హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు త్రిపుల్ హ్యాట్రిక్‌కి ఆయ‌న శ్రీ‌కారం చుడుతున్నారు. ఆ చిత్ర‌మే.. ఈ నెల 21న రాబోతున్న ఎం.సి.ఎ. సినిమా. దాంతో పాటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో నటిస్తున్నారు నాని.

నితిన్ సినిమాకి ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్ర‌మే కాదు.. ఆయ‌న అభిమాని నితిన్ కూడా వ‌చ్చే ఏడాది 25వ చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ప‌వ‌న్ అజ్ఞాత‌వాసితో 25 చిత్రాల‌ను పూర్తిచేసుకుంటే.. నితిన్ ఏమో ప‌వ‌న్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ క‌లిసి నిర్మిస్తున్న చిత్రంతో 25 సినిమాల‌ను పూర్తిచేసుకుంటున్నాడు.