సినిమాల్లోకి హీరోయిన్ కుమారుడు

  • IndiaGlitz, [Wednesday,December 13 2017]

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు ఇటా స్టార్స్‌తో న‌టించిన హీరోయిన్ సుమ‌ల‌త అందరికీ గుర్తుండే ఉంటుంది. క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్‌ను వివాహం చేసుకుని సెటిలైంది. తెలుగునాట జ‌రిగే వేడుక‌ల‌కు వ‌స్తూ ఉండ‌టం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే త‌ల్లి, వ‌దిన‌, అక్క పాత్ర‌లు కూడా చేసింది. ఇప్పుడు అస‌లు విష‌యంలోకి వెళితే..న‌టులుగా అంబ‌రీష్‌, సుమల‌త‌కు కన్న‌డంలో చాలా మంచి పేరుంది.

కాబ‌ట్టి వీరు త‌మ త‌న‌యుడు అభిషేక్ సినీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. కొన్ని రోజులుగా అభిషేక్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ప‌వ‌న్ వ‌డియార్ లేదా సంతోష్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

మ‌రి సినిమాను క‌న్న‌డ‌తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల చేస్తారా? లేక అభిషేక్‌ను తెలుగులో స‌ప‌రేట్‌గా వేరే సినిమాతో ఎమైనా ఇంట్ర‌డ్యూస్ చేస్తారా? అని చూడాలి.