నిర్మాతలుగా మారుతున్న మహేష్ డిస్ట్రిబ్యూటర్స్

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

శ్రీమంతుడు, రుద్రమదేవి, నాన్నకు ప్రేమతో సహా పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ త్వరలోనే నిర్మాతలుగా మారుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలియ‌జేశారు. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమానే రూపొందాల్సింది కానీ స్టార్టయిన సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇప్పుడు సినిమా మ‌రీ ప్రారంభం కానుంది. మార్చిలో సినిమా ఓపెనింగ్ జ‌రుగుతుంది. ఏప్రిల్ 8 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంద‌ట‌. మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్‌.