అభిషేక్ పిక్చర్స్ చేతిలో 'కబాలి'...

  • IndiaGlitz, [Friday,May 13 2016]

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి'. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా రాధికా అప్టే నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి థాను వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. తాజా సమాచార ప్రకారం ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు ఫ్యాన్సీ రేటుని చెల్లించి విడుదల హక్కులను సొంతం చేసుకున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిషేక్ పిక్చర్స్ కబాలి చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మే 30న సినిమా ఆడియో విడుదల చేసి సినిమాను జూలై 1న విడుదల చేయాలనుకుంటున్నారట.