అభిషేక్ నామ చేతికి రామ్ గోపాల్ వర్మ 'భైరవ గీత'..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత'.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఈరోజు ఆర్జీవీ స్వయంగా అయన చేతులమీదుగా రిలీజ్ చేయగా, ఆ ఫస్ట్ లుక్ లో ప్రధాన పాత్రలు ఎంతో ఎమోషనల్ లుక్ లో కనపడుతుండడం విశేషం.
ధనంజయ మరియు ఇర్రా లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ మరియు క్లాస్ స్ట్రగుల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథకి ఇంప్రెస్ అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ చిత్ర హక్కులను సొంతం చేసుకోగా.
ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ని సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేయబోతున్నారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments