'నాన్నకు ప్రేమతో' నైజాం హక్కులు పొందిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం హక్కులను దక్కించుకోవడానికి పలువురు పంపిణీదారులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో నైజం హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ దక్కించుకున్నారు.
ఈ క్రేజీ చిత్రం హక్కులు దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అభిషేక్ తెలిపారు. ఇటీవల శ్రీమంతుడు, రుద్రమదేవి, త్రిపుర వంటి విజయవంతమైన చిత్రాలను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన అభిషేక్ ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో' మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని పేర్కొన్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com