ఎన్టీఆర్ - బాబీ మూవీకి అడ్డుగా అభిషేక్ బచ్చన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఏ సినిమా చేయనున్నాడు అనే విషయం పై చాలా మంది డైరెక్టర్స్ పేర్లు తెర పైకి వచ్చాయి. ఫైనల్ గా సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ ని కన్ ఫర్మ్ చేసారని సమాచారం. ఎట్టకేలకు ఎన్టీఆర్ స్టోరీ ఫైనల్ చేసారు ఇక బాబీ డైరెక్షన్ లో సినిమా త్వరలో ప్రారంభిస్తారు అనుకుంటుంటే...ఈ మూవీకి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అభ్యంతరం చెబుతున్నారట. ఇదేమిటి...ఎన్టీఆర్ తో బాబీ చేయాలనుకుంటున్న మూవీకి అభిషేక్ బచ్చన్ అభ్యంతరం చెప్పడం ఏమిటి అనుకుంటున్నారా..?
బాబీ...కోన వెంకట్ రాసిన కథను ఎన్టీఆర్ కు చెప్పారట. ఈ కథను కోన వెంకట్ గతంలో అభిషేక్ బచ్చన్ కు చెప్పడం...కథ నచ్చి అభిషేక్ కోనకు అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిందట. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఈ కథ నచ్చడంతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాను అని అభిషేక్ కి కోన చెప్పాడట. అయితే...అభిషేక్ నో అంటున్నాడట. దీంతో కోన తన గురువు రామ్ గోపాల్ వర్మను సంప్రదించి విషయం చెప్పాడట. ఇప్పుడు ఈ విషయాన్ని వర్మ డీల్ చేస్తున్నాడట. వర్మ మాట కాదనలేక అభిషేక్ ఓకే అంటే...ఎన్టీఆర్ - బాబీ మూవీ సెట్స్ పైకి వెళుతుంది. లేదంటే...ఎన్టీఆర్ తదుపరి సినిమా కథ మళ్లీ మొదటకి వస్తుంది. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com