అభినేత్రి ట్రైల‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Monday,September 12 2016]

త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవా నిర్మిస్తుంటే, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్ అందిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ త‌మిళ్ & హిందీ ట్రైల‌ర్స్ ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు.

ఇక తెలుగు వెర్షెన్ ట్రైల‌ర్ ను ఆదివారం రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో... ఇండ‌స్ట్రీ మొత్తం మీ గురించే మాట్లాడుతోంది మేడమ్. గ్యారెంటీగా నెక్ట్స్ శ్రీదేవి మీరే మేడ‌మ్ అంటూ ముర‌ళీశ‌ర్మ చెప్పే డైలాగ్ తో ఈ మూవీ పై మ‌రింత ఇంట్ర‌స్ట్ పెరిగింది అని చెప్ప‌చ్చు.ఈ చిత్రంలో అమీ జాక్స‌న్, ఫ‌రాఖాన్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. హ‌ర్ర‌ర్ కామెడీ జోన‌ర్ లో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

హ్యాపీ బ‌ర్త్ డే టు అమ‌ల అక్కినేని..!

క్లాసిక్ డాన్స‌ర్ గా..క‌ధానాయిక‌గా...బాధ్య‌త గ‌ల ఇల్లాలిగా..మాతృమూర్తిగా..బ్రూ క్రాస్ సొసైటీ ఫౌండ‌ర్ గా....ఇలా ప్ర‌తి ద‌శ‌లోను ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలుస్తున్న గొప్ప మాన‌వ‌తామూర్తి  శ్రీమ‌తి అమ‌ల అక్కినేని. సెప్టెంబ‌ర్ 12 అమ‌ల పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా  అక్కినేని అమ‌ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం...

రెండు సీన్స్ యాడ్ అయ్యాయి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మోహ‌న్ లాల్, స‌మంత‌, నిత్యామీన‌న్ త‌దిత‌రులు న‌టించిన చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మింప‌బ‌డిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటూ ముందుకు వెళుతుంది.

ఈ జనరేషన్ లో తమన్నాయే బెస్ట్ డ్యాన్సర్ : ప్రభుదేవా

మిల్కీ బ్యూటీ తమన్నా టైటిల్ పాత్రధారిగానే కాకుండా తొలిసారి నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తమన్నా భర్త పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తాడు.

క‌మ‌ల్ క్లారిటీ ఇచ్చేశాడు

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు రెస్ట్‌లో ఉన్నాడు. అయితే సినిమాకు సంబంధించిన రైటింగ్ వ‌ర్క్‌ను మ‌రోసారి చెక్ చేసుకుంటున్నాడు.

గోపీచంద్‌ను లైన్‌లో పెట్టాడు

మాస్ మ‌హారాజా ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ సినిమా త‌ర్వాత వేరే సినిమాలేవీ చేయడం లేదు. విక్రం సిరి దర్శకత్వంలో ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేశాడు.