అభినేత్రి ట్రైల‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Monday,September 12 2016]

త‌మ‌న్నా, ప్ర‌భుదేవా, సోనూసూద్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో విజ‌య్ తెర‌కెక్కించిన చిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో ప్ర‌భుదేవా నిర్మిస్తుంటే, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఇక తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్ అందిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ త‌మిళ్ & హిందీ ట్రైల‌ర్స్ ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు.

ఇక తెలుగు వెర్షెన్ ట్రైల‌ర్ ను ఆదివారం రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో... ఇండ‌స్ట్రీ మొత్తం మీ గురించే మాట్లాడుతోంది మేడమ్. గ్యారెంటీగా నెక్ట్స్ శ్రీదేవి మీరే మేడ‌మ్ అంటూ ముర‌ళీశ‌ర్మ చెప్పే డైలాగ్ తో ఈ మూవీ పై మ‌రింత ఇంట్ర‌స్ట్ పెరిగింది అని చెప్ప‌చ్చు.ఈ చిత్రంలో అమీ జాక్స‌న్, ఫ‌రాఖాన్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. హ‌ర్ర‌ర్ కామెడీ జోన‌ర్ లో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.