అభినేత్రి తొలి దర్శనం అదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పోరేషన్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతుంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అభినేత్రి షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే...ఈరోజు అభినేత్రి తమన్నా తొలి దర్శనం అదే...ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. తమన్నా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. ఈ మంచి డ్యాన్సర్ కి ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా సహకారం అందిస్తే..ఇంకేముంది డ్యాన్స్ ల్లో టాప్ లేచిపోద్ది. తమన్నా అదే చేసింది. ఫస్ట్ లుక్ లో ...స్టైలీష్ స్టెప్స్ తో అదరగొట్టేసింది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ తో అభినేత్రి పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు తమన్నా ఫస్ట్ లుక్ కూడా అదిరిపోవడంతో మరింతగా అంచనాలు పెరిగాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో రూపొందిన అభినేత్రి సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com