'అభినేత్రి' రిలీజ్ డేట్ మారింది...

  • IndiaGlitz, [Friday,August 12 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి'లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్నిఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. బ్రిటీష్ సుంద‌రి ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేస్తున్నారు.