అభినేత్రి నిర్మాత ఎం.వి.వి సత్యనారాయణ అరెస్ట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి చిత్రాల నిర్మాత, ఎం.వి.వి బిల్డర్స్ అధినేత ఎం.వి.వి. సత్యనారాయణను భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణ పై విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న మధురవాడలో పంచాయితీ అనుమతి పొందిన లే అవుట్ లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 88 మందికి స్ధలాలు ఉన్నాయి. ఈ 88 మంది స్ధలాల్లో 38 మంది స్ధలాలను సేకరించి విశాఖపట్నం సిటీ పేరుతో గృహనిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
అయితే...38 మంది స్ధలాలు కాకుండా మిగిలిన వాళ్ల స్ధలాలు ఆక్రమించి రోడ్డు నిర్మిస్తున్నారనేది ఆరోపణ. తమ స్ధలాన్ని ఎం.వి.వి సత్యనారాయణ ఆక్రమించారని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రాధమికంగా ఆరోపణలు రుజువుకావడంతో ఎం.వి.వి. సత్యనారాయణను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకన్నారు. అయితే...అరెస్ట్ అనంతరం గుండె నొప్పి వస్తుంది అనడంతో ఎం.వి.వి.సత్యనారాయణను చికిత్స నిమిత్తం కె.జి.హెచ్ కి తరలించామని పోలీసులు తెలియచేసారు. ఇదిలా ఉంటే... ఎం.వి.వి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ...నిబంధనల ప్రకారమే నిర్మాణాలు చేపట్టాను. ఇదంతా టి.డి.పి నాయకుడు కళా వెంకట్రావు కుట్ర అని ఆరోపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout