అభినేత్రి నిర్మాత ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ అరెస్ట్..!

  • IndiaGlitz, [Saturday,September 17 2016]

గీతాంజ‌లి, శంక‌రాభ‌ర‌ణం, అభినేత్రి చిత్రాల నిర్మాత, ఎం.వి.వి బిల్డ‌ర్స్ అధినేత ఎం.వి.వి. స‌త్యనారాయ‌ణ‌ను భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డార‌నే ఆరోప‌ణ పై విశాఖ‌ప‌ట్నం పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న మ‌ధుర‌వాడ‌లో పంచాయితీ అనుమ‌తి పొందిన లే అవుట్ లో ఉత్త‌రాంధ్ర జిల్లాల‌తో పాటు వివిధ ప్రాంతాల‌కు చెందిన మొత్తం 88 మందికి స్ధ‌లాలు ఉన్నాయి. ఈ 88 మంది స్ధలాల్లో 38 మంది స్ధలాల‌ను సేక‌రించి విశాఖ‌ప‌ట్నం సిటీ పేరుతో గృహ‌నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.

అయితే...38 మంది స్ధలాలు కాకుండా మిగిలిన వాళ్ల స్ధలాలు ఆక్ర‌మించి రోడ్డు నిర్మిస్తున్నార‌నేది ఆరోప‌ణ‌. త‌మ స్ధలాన్ని ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ ఆక్ర‌మించార‌ని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జ‌డ్డు విష్ణుమూర్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ప్రాధ‌మికంగా ఆరోప‌ణ‌లు రుజువుకావ‌డంతో ఎం.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌ను ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుక‌న్నారు. అయితే...అరెస్ట్ అనంత‌రం గుండె నొప్పి వ‌స్తుంది అన‌డంతో ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌ను చికిత్స నిమిత్తం కె.జి.హెచ్ కి త‌ర‌లించామ‌ని పోలీసులు తెలియ‌చేసారు. ఇదిలా ఉంటే... ఎం.వి.వి స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడుతూ...నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నిర్మాణాలు చేప‌ట్టాను. ఇదంతా టి.డి.పి నాయ‌కుడు క‌ళా వెంక‌ట్రావు కుట్ర అని ఆరోపించారు.

More News

Just in: First look and title of 'Irudhi Suttru' Telugu remake

'Irudhi Suttru' is one of the critically acclaimed blockbusters this year and the film paved way for a marvellous reentry of actor Madhavan who played a rugged Boxing coach and a real-life boxer Rithika Singh proved to be one of the most promising finds of Kollywood in recent years The film was directed by Sudha Kongura who smashed every pre-conceived notion about women filmmakers by delivering a

Venkatesh's 'Guru' First Look out

So, this is how the boxing 'Guru' looks.  Intense is the word.  Never-say-die-spirit is his second nature.  The look says it all.  Venkatesh is out to play one of the most serious roles of his career.

One film, five National Awardees

It's the coming together of five National Awardees for one movie.  That's 'Mana Oori Ramayanam' for you.  The October 7 release, a human drama with an inbuilt message, boasts of the confluence of such talent as Prakash Raj, Ilayaraja, Priyamani, Sreekar Prasad and Shashidhar Adapa.

Naga Chaitanya has double advantage

It's known that Naga Chaitanya has been on a signing spree.  Even as he has two rom-com entertainers, namely 'Premam' and 'Sahasam Swasaga Sagipo' scheduled to release in the coming months, Chai has been signed up for a movie each in the direction of Kalyan Krishna ('Soggade Chinni Nayana' fame), debutante Krishna, and Mohankrishna Indraganti.

Nayanthara's Onam Celebration Selfie with Vignesh going Viral

A selfie is going viral of Nayanthara with Vignesh taken during their Onam Celebration at the Nayan’s residence in Kochi. This selfie further underlines the rumor that both are in love.