అభినేత్రి విడుదల తేదీ ఖరారు
Tuesday, July 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన విభిన్న కథాచిత్రం అభినేత్రి. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్, బ్లూ సర్కిల్ కార్పోరేషన్, బి.ఎల్.ఎన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతుంది. దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న అభినేత్రి షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ అభినేత్రి పై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే...అభినేత్రి సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మరి...తమన్నా డిఫరెంట్ గెటప్ లో నటించిన అభినేత్రి ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments