ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ.. ప్రజల్లోకి వచ్చి వాల్ పోస్టర్స్ అంటించిన "రామ్ అసుర్" హీరో అభినవ్ సర్ధార్ హీరోయిన్ చాందిని
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ రోజుల్లో అన్ని హంగులతో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, సరిగ్గా ప్రమోట్ చేసుకోవడం మరో ఎత్తవుతోంది. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, వాటిపై ప్రేక్షకుల దృష్టిని పడేలా చేసుకోవడం తప్పనిసరి అయింది. అలా చేయడం వల్లే మూవీ గురించి తెలిసుకొని చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్.
అయితే ఓ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. కొందరు భారీ ఏర్పాట్లతో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తుంటారు, ఇంకొందరు స్టార్ హీరోలతో టైటిల్, టీజర్ లాంచ్ లాంటివి చేస్తుంటారు. తాజాగా అదేబాటలో తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా వినూత్నమైన ప్లాన్ చేశారు "రామ్ అసుర్" హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని వాళ్ళు చెప్పారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు.
వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న "పీనట్ డైమండ్" చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను `రామ్ అసుర్`గా మార్చడమైనది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నవంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ లీడ్ రోల్స్ పోషించారు. `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చుతున్నారు.
ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నిర్మించారు. ఇటీవల ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.అలాగే ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం. ఇక రీసెంట్‌గా పలువురు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com