విజేతగా స్వదేశానికి వచ్చిన అభినందన్
Send us your feedback to audioarticles@vaarta.com
పాక్ ఆర్మీ బందీగా పట్టుబడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విజేతగా స్వదేశానికి వచ్చేశారు. వాఘా సరిహద్దు వద్ద పౌరులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు. త్రివర్ణ పతకాలతో భారత్‌కు మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. వందలాది మంద్రి ప్రజలు డ్రమ్స్ వాయిస్తూ అభినందన్ ఫోటోలు, పూలదండలు, జాతీయ జెండాలతో అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దు వద్దకు వచ్చి రియల్ హీరోకు వెల్కమ్ పలికారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఒక్క వాఘా సరిహద్దుల్లోనే కాకుండా యావత్ భారత్ వ్యాప్తంగా పౌరులంతా ఆయనకు స్వాగతం పలికారు. మరోవైపు అభినందన్ కుటుంబీకులు ఆయన్ను కలిసి స్వాగతం పలికారు. జయహో అభినందన్ అంటూ వాఘా సరిహద్దుల్లో నినాదాలు మార్మోగాయి.
సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 03:58 గంటలకు ఇండియాకు అభినందన్ చేరుకున్నారు. భారత రాయబారి గౌరవ్ అహ్లువాలియ అప్పగింత వ్యవహారాలు పూర్తి చేయగా.. దగ్గరుండి అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్ జె.టి. క్రెయిన్ తీసుకొచ్చారు. వాఘా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అభినందన్ రానున్నారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత డీ బ్రీఫింగ్ ప్రక్రియలో భాగంగా అభినందన్‌ను ప్రశ్నించనున్నారు. అభినందన్ మొత్తం ఎపిసోడ్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.
అభినందన్ విడుదలకు ముందు..అభినందన్‌ని విడుదల చేయొద్దంటూ ఇస్లామాబాద్ హై కోర్టులో ఓ పాకిస్తానీ పిటిషన్ వేశాడు. భారత పైలట్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేసి నేరానికి పాల్పడ్డాడని, అతడిపై విచారణ జరగాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఐతే ఆ పిటిషన్‌పై విచారించేందుకు కోర్టు నిరాకరించి పాకిస్తానీని ఇంటికి పంపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout