భారత హైకమిషన్‌‌కు 'అభినందన్' అప్పగింత

  • IndiaGlitz, [Friday,March 01 2019]

ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌‌ను పాక్ అధికారులు భారత హైకమిషన్‌‌కు అప్పగించారు. గురువారం మధ్యాహ్నం అభినందన్‌‌ను ఇస్లామాబాద్‌‌లోని భారత హైకమిషన్‌కు అప్పగించడం జరిగింది. ఇవాళ 3 గంటలకు ఆయన అట్టారి-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా ఇండియాలో అడుగుపెట్టనున్నారు. శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన విషయం విదితమే.

అభినందన్ విడుదలవేళ భారత్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. వేలాదిమంది భారతీయులు వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌కు ఘనస్వాగతం పలికేందుకు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అభినందన్ కుటుంబీకులు ఆయన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభినందన్ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది భారతీయుల్లో క్షణ క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు కోట్లాది మంది యువత ఆయనకు అభిమానులుగా మారిపోయారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా జనాలు అభినందన్ రాకను చూసేందుకు టీవీల ముందు కూర్చున్నారు.

ఇదిలా ఉంటే అభినందన్ విడుదల క్రమంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ‘నోబెల్ శాంతి పురస్కారం’ ఇవ్వాలంటూ పిచ్చి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం నోబెల్‌ పీస్‌ప్రైజ్ ఫర్ ఇమ్రాన్ ఖాన్ (#NobelPeacePrizeForImranKhan) పాక్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌‌లో మోత మోగుతోంది.

More News

కొన్ని కుటుంబాల వల్లే రాయలసీమకు చెడ్డ పేరు

కొన్ని కుటుంబాల వల్ల రాయలసీమకు చెడ్డ పేరు వస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.

జగన్ సొంత జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ సొంత జిల్లా, పార్టీ కంచుకోటగా పేరుగాంచిన కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైపోయింది.

ఉచిత విద్య, వైద్యం, ప్రయాణమే జనసేన లక్ష్యం

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యార్ధుల‌కి ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం, ఉచిత క్యాంటిన్లు అందుబాటులోకి తెస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.

దర్శకుడు సురేశ్ కృష్ణకు అరుదైన పురస్కారం

తమిళ సర్కార్ ప్రతిష్టాత్మకంగా 1968 నుంచి ‘కళైమామణి’ పురస్కారాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

నేను ముఖ్యమంత్రి అయితే.... పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్య‌మంత్రి అయితే ల‌క్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్య‌త తీసుకుంటాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.