వింగ్ కమాండర్ అభినందన్ కొత్త వీడియో రిలీజ్...
Send us your feedback to audioarticles@vaarta.com
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భారత్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే భారత్ అధికారులకు అభినందన్‌ను పాక్ అప్పగించింది. ఇప్పటికే అభినందన్ కొడుతున్నట్లు పలు వీడియోలో నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అభినందన్‌కు సంబంధించిన మరో వీడియోలో విడుదలైంది. అసలు పాక్‌లో అడుగుపెట్టిన తర్వాత, ఆర్మీకి బందీగా చిక్కిన తర్వాత ఏం జరిగింది..? అనే విషయాలు ఈ వీడియోలో అభినందన్ వివరించారు.
వీడియోలో ఏముందంటే...
"నేను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. నా పిస్టోల్ కింద పడిపోయింది. నన్ను నేను రక్షించుకోడానికి పరుగులు తీశాను. మూక నా వెంట పడ్డారు. వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్ జవాన్లు వచ్చారు. వాళ్లే నన్ను మూక నుంచి రక్షించారు. తర్వాత నన్ను వాళ్ల యూనిట్ తీసుకెళ్లారు. అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేశారు.
తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే వైద్యపరీక్షలు నిర్వహించారు. నా విషయంలో పాకిస్థాన్ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు" అని కొత్తగా విడుదల చేసిన వీడియోలో అభినందన్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments