అభినందన్‌కు జరిపిన వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
పాక్ చెరనుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్, రియల్ హీరో అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ప్యారాచూట్ సహాయంతో కిందికి దూకిన తర్వాత ఆయన్ను వెంబడించిన కొన్ని మూకలు అభిపై దాడి చేశారు.. ఆ తర్వాత పాక్ ఆర్మీ చిత్రవధ, మనోవేదనకు గురిచేసిందని స్వయానా ఆయనే తెలిపారు. అయితే తాజాగా ఎయిర్ మార్షల్స్ అభినందన్‌కు వైద్య పరీక్షలు(ఎంఆర్ఐ స్కాన్) నిర్వహించారు. పరీక్షల్లో అసలేం తేలింది..? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అనే విషయాలు వైద్యులు మీడియాకు వివరించారు.
వైద్యుల మాటల్లోనే...
"అభినందన్ శరీరంలో ఎలాంటి భగ్స్ లేవు. మూకల దాడిలో అభినందన్ పక్కటెముకలు కొద్దిగా దెబ్బతిన్నాయి. వర్థమాన్ వెన్నెముకకు కూడా కొద్దిగా గాయమైంది" అని వైద్యులు తెలిపారు. ఇండియాకు క్షేమంగా తిరిగొచ్చిన వీరుడా త్వరగా కోలుకో అంటూ యావత్ భారత్ కోరుకుంటోంది. కాగా వైద్య పరీక్షల అనంతరం కొందరు నిపుణుల మధ్య సైకలాజికల్ పరీక్షలు.. ఆ తర్వాత ఉన్నతాధికారులు ఈయన్ను విచారించనున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఫైనల్‌గా ఈ రిపోర్ట్ మొత్తం ఇండియన్ ఫోర్స్ అధికారులకు వెళ్లనుంది. అప్పుడు ఉన్నతాధికారులు అభిని యథావిథిగా విధుల్లో చేర్చుకుంటారని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలంటే మరో వారం రోజులకు పైగా పట్టే అవకాశాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments