భారత్‌ గడ్డపై అడుగుపెట్టిన రియల్ హీరో 'అభినందన్‌'

  • IndiaGlitz, [Friday,March 01 2019]

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ స్వదేశానికి చేరుకున్నారు. అటారీ-వాఘా సరిహద్దులో భారత ఆర్మీకి పాకిస్థాన్ అప్పగించింది. రాత్రి 9:19 నిమిషాలకు భారత గడ్డపై అడుగుపెట్టారు. అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టిన క్షణాలన సంబరాలు మిన్నంటాయి. కాగా మధ్యాహ్నం వింగ్ కమాండర్ 3గంటలకు వాఘా సరిహద్దుల్లో అభినందన్ అడుగుపెట్టారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడుదలలో జాప్యం జరిగింది. దీంతో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల సస్పెన్స్ నెలకొంది. దీంతో విడుదల విషయంలో పునరాలోచనలో పడిందని ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. మరోవైపు విడుదలకు ముందు కొన్ని షరతులు పెట్టాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో వాఘా సరిహద్దులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అప్పటికే రెండు సార్లు అప్పగింత సమయాన్ని మార్చడంతో ఇవాళ కష్టమోనని అందరూ భావించారు. సరిహద్దు నుంచి నిరాశతో వెనుదిరిగారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి 9:20 వరకు అసలేం జరిగింది..
సరిగ్గా రాత్రి రాత్రి 9:19 నిమిషాలకు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభినందన్‌కు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. సుధీర్ఘ ప్రక్రియ తర్వాత పాక్ ఆర్మీ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఐసీఆర్సీ ప్రకారం నిబంధనల ప్రకారం చీకటి పడ్డ తర్వాతే అప్పగింత ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ అనంతరం  వైమానిక దళ వైస్‌ మార్షల్‌ ఆర్‌జీకే కపూర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వింగ్‌కమాండర్ అభినందన్‌కు తమకు అప్పగించారన్నారు. అభినందన్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభినందన్ ఇండియాకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను కట్టుదిట్టమైన భద్రత మధ్య అమృత్‌సర్‌కు తరలించడం జరిగింది. అక్కడ్నుంచి అభినందన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తరలించనున్నారు. ఇద్దరు ఎయిర్‌మార్షల్స్ ఆధ్వర్యంలో అభినందన్‌ను తరలించారు. వాహనంలో వర్థమాన్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు  కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైహింద్, భారత్‌మాతాకీ జై అని ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభినందన్ రాకతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

More News

ఈ హీరోయిన్ ..బ‌న్నితో హ్యాట్రిక్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగం పుంజుకుంటున్నాయి.

ఎన్నిక‌ల త‌ర్వాతే బాల‌య్య ప్లాన్‌..

నంద‌మూరి బాల‌కృష్ణ 103వ చిత్రంలో న‌టించేందుకు స‌ర్వం సిద్ధ‌మ‌వుతున్నాయి. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

చెల్లెలి ఎంట్రీ గురించి సాయిప‌ల్ల‌వి ఏమందంటే..

ఫిదా చిత్రం సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా గుర్తుండిపోయిన త‌మిళ పొన్ను సాయిప‌ల్ల‌వి..

జగన్‌ పై నమ్మకం లేక ఎమ్మెల్యే రాజీనామా..

ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో..

విజేతగా స్వదేశానికి వచ్చిన అభినందన్

పాక్ ఆర్మీ బందీగా పట్టుబడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విజేతగా స్వదేశానికి వచ్చేశారు. వాఘా సరిహద్దు వద్ద పౌరులు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్