బాలీవుడ్లో రియల్ హీరో ‘అభినందన్’ బయోపిక్!
Send us your feedback to audioarticles@vaarta.com
అభినందన్.. అభినందన్.. అభినందన్.. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. ప్రధానమంత్రి, రీల్ హీరోలు, ప్రముఖుల మెప్పును సైతం పొందిన రియల్ హీరో అభినందన్ వర్థమాన్.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమే. శత్రువుల చెరలోకి వెళ్లి కూడా ఎలాంటి బెరుకు లేకుండా ధీరుడిలా ధైర్యంతో వారు ఎన్ని చిత్రహింసలు పెట్టినా చిన్నపాటి క్లూ కూడా దొరకుండా వారికి ఏ మాత్రం సమాచారం చెప్పకుండా ఏ ప్రశ్న అడిగినా కూల్ కూల్గాన్ సమాధానమిచ్చి.. పాక్ ప్రజలచేత చప్పట్లు కొట్టించుకున్న ‘మగధీరుడు.. అభినందనుడు’. ఈయనే కాదు ఫ్యామిలీ ఫ్యామిలీనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సేవలందించినదే.
అందుకే అభినందన్‌పై బయోపిక్ తీయాలని బాలీవుడ్ భావిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాదు అన్ని చోట్లా బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న.. దర్శకులు నడిపిస్తున్న విషయం విదితమే. అందుకే రియల్ హీరో.. అభినందన్ జీవిత చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాతలు కొందరు ఉవ్విళ్లూరుతున్నారట. అభినందన్ పాక్ చెరలో ఉన్నప్పట్నుంచి ఆయన రిలీజ్ అయ్యి క్షేమంగా చేరుకున్నప్పటి వరకూ యావత్ ప్రపంచంలో ఉండే సినీ నటీనటులు, భారత్ పౌరులు ప్రార్థనలు చేసి.. సేఫ్‌గా తిరిగి రావాలని కోరుకున్నారు. వారిలో ఒక్కరైన జాన్ అబ్రహం.. అభినందన్ పాత్రలో చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట.
తెరకెక్కించేదెవరు..!?
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలకు సూపర్ డూపర్ చిత్రాలను అందించి తన సత్తా ఏంటో బాలీవుడ్‌కు చాటిచెప్పిన అభిషేక్ కపూర్ ‘అభింనదన్’ బయోపిక్కు దర్శకత్వం వహిస్తారని టాక్ నడుస్తోంది. టీ-సిరీస్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా పుల్వామా దాడి మొదలుకుని అభినందన్ ఇంటికి చేరుకున్న వరకు మొత్తం వ్యవహారాన్ని సినిమాలో చూపించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అభినందన్ పాత్రలో నటించాలని జాన్ అబ్రహంను అడగ్గా.. మారుమాట చెప్పకుండా రెడీ అని చెప్పేశారట. అయితే ఇది ఎంత వరకు నిజం..? అనేది తెలియరాలేదు. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అయితే ప్రస్తుతం ఇదంతా ట్రెండ్ కనుక సినిమా తెరకెక్కిస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ కాదు కదా.. అంతకుమించి అవుతుందని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇది రూమర్‌గానే మిగిలిపోతుందా లేకుంటే సెట్స్దాకా వెళ్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout