'అభిమన్యుడు' బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్, హ్యాట్రిక్ హీరోయిన్ సమంత యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్ బేనస్స్‌పై ఎమ్. పురుషోత్తమ్ సమర్పణలో యువ నిర్మాత జి. హరి నిర్మించిన 'అభిమన్యుడు' గతవారం విడుదలై సూపర్ టాక్‌తో సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లోహీరో విశాల్, అర్జున్, పి.ఎస్.మిత్రన్, శ్రీనాథ్, కో ప్రొడ్యూసర్స్ ప్రకాశ్, ఎన్.పురుషోత్తమ్, రచయిత రాజేశ్, వైజాగ్ పూర్వీ పిక్చర్స్ వేగి వీర్రాజు, వెస్ట్ గోదావరి ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ ఉదయ్, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్, కృష్ణా డిస్ట్రిబ్యూటర్ ఎన్.సర్వేశ్వర్‌రావు, గుంటూరు పూర్ణోదయా పిక్చర్స్ శ్రీను, నెల్లూరు అంజలి పిక్చర్స్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా....నిర్మాత జి.హరి మాట్లాడుతూ - "మా అభిమన్యుడు చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. చాలా రోజులు నుండి నిర్మాతగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాను. వారం రోజుల్లోనే సినిమా 12 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను వసూలు చేసింది. డబ్బులతో పాటు మంచి పేరు కూడా తెచ్చి పెట్టిన సినిమా ఇది.ఈ సినిమాకు నిర్మాతగా కావడం గర్వంగా ఉంది.
రెండో వారంలో కూడా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంకా సినిమా 265 థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు పి.ఎస్.మిత్రన్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. విశాల్‌గారు స్క్రీన్‌పైనే కాదు..రియల్ లైఫ్‌లో కూడా హీరోనే. అందుకనే సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
నిజ జీవితానికి విశాల్‌గారి క్యారెక్టర్ దగ్గరగా ఉండటంతో సినిమా మంచి విజయాన్ని సాధించింది. అర్జున్‌గారు ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. రాజేశ్‌గారు మంచి డైలాగ్స్ రాశారు. విశాల్‌గారు ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చినందకు ఆయనకు నా స్పెషల్ థాంక్స్" అన్నారు.
పి.ఎస్.మిత్రన్ మాట్లాడుతూ - "దర్శకుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా పెద్ద విజయాన్ని అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. రాజేశ్ డైలాగ్స్, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్‌గారి మ్యూజిక్ సహా అందరూ ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు.
డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రయిట్ సినిమాను ఆదరించినట్లు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. విశాల్‌గారు నిర్మాత చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. అర్జున్‌గారి క్యారెక్టర్‌కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. వైట్ డెవిల్‌గా ఆయన అద్భుతంగా నటించారు. తమిళంలో చాలా ఇబ్బందలు మధ్య విడుదలైన సినిమా పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడిగా నాతో పాటు యూనిట్ అందరం సినిమా కోసం హార్డ్ వర్క్ చేశాం"అన్నారు.
అర్జున్ మాట్లాడుతూ "సినిమా సక్సెస్ షీల్డులను మరిచిపోతున్న రోజుల్లో 'అభిమన్యుడు' తో బ్లాక్‌బస్టర్ షీల్డ్‌ను అందుకోవడం ఆనందంగా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ ముఖాల్లో ఆనందం కనపడుతుంది. ఈ సినిమాలో వర్క్‌చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు నా అభినందనలు. నా క్యారెక్టర్‌కి చాలా మంచి పేరు వచ్చింది. ఓ సినిమా హిట్ లేదా ప్లాప్‌కి డైరెక్టరే కారణం.
ఈ సినిమా ఇంత పెద్ద హిట్‌కావడం వెనుక ఉన్న క్రెడిట్ మిత్రన్‌కే దక్కుతుంది. విశాల్ హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఎంత కష్టాలు వచ్చినా.. అభిమన్యుడులా ఫైట్ చేసి నిజమైన విక్టరీ అంటే ఇదేనని నిరూపించారు. ఈ సినిమాతో రియల్ లైఫ్ హీరో అని విశాల్ ప్రూవ్ చేసుకున్నాడు. హరి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్. ఈ సినిమాను చాలా ప్లాన్‌తో ఫ్రాంచైజీ చేశారు" అన్నారు.
హీరో విశాల్ మాట్లాడుతూ - "తమిళంలో ఐదో వారం వచ్చిన సినిమా హౌస్‌ఫుల్‌గానే రన్ అవుతుంది. ఓవర్‌సీస్ సహా ఇక్కడ విడుదలైన ప్రతి స్టేట్‌లో సినిమా స్ట్రాంగ్‌గా రన్ అవుతుంది. అభిమానులే కాదు, విమర్శకుల నుండి కూడా సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు ఆనందంగా ఉంది.
డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యజమానులు హ్యాపీగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం. అందరూ సమ్మర్‌కి బ్లాక్‌బస్టర్ వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీలైంది. నా కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళం సహా తెలుగులో కూడా ఒకేరోజు విడుదల ప్లాన్ చేసినప్పటికీ తెలుగులో మే 11న ఎక్కువ సినిమాలు ఉండటంతో సోలోగా మంచి థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయాలని జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం.
మిత్రన్ ఇంటెలిజెంట్‌గా సినిమాను తెరకెక్కించారు. శంకర్‌గారి జెంటిల్‌మెన్, మురుగదాస్‌గారి గజిని సినిమాల్లా ఈ సినిమాతో మిత్రన్ మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఇండియాలో కూడా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. మీడియా కూడా ఈ సక్సెస్‌లో తమవంతు పాత్రను పోషించింది. ఈ సందర్భంగా మీడియాకి థాంక్స్" అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా సక్సెస్ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com