'అభిమన్యుడు' లో 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్ చేసెలేరా'.. పాట విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అభిమన్యుడు'. ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలోని 'యాంగ్రి బర్డ్‌లాంటి నన్నె తను లవ్ చేసెలేరా..' అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. ఇటీవల యూత్‌స్టార్ నితిన్ విడుదల చేసిన 'తొలి తొలిగా తొలకరి చూసి పిల్లాడ్నై.. పాటకు చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మాస్ హీరో విశాల్, సమంత, యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: ఉమేష్ జె.కుమార్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాశ్, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com