అభి, అఖిల్, మోనాల్.. కథ మళ్లీ మొదలైందా!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక సభ్యుడిని బిగ్‌బాస్ పంపించారు. ఆ సభ్యుడిని అరియానా రిసీవ్ చేసుకుని ఇంటి సభ్యులకు పరిచయం చేయాలని బిగ్‌బాస్ చెబుతారు. అయిత ఆ వైల్డ్ కార్డ్ ఒక బొమ్మ. దాని పేరు చింటు అని అరియానా చెప్పింది. ఆ బొమ్మతో అవినాష్ మైమ్ చేయడంతో అరియానా బాగా ఎమోషనల్ అయిపోయింది. అభి, అఖిల్ కాన్వర్సేషన్. సొహైల్ గురించి అఖిల్, అభి మాట్లాడుకుంటుంటే.. మరోవైపు మెహబూబ్, సొహైల్ మధ్య కాన్వర్సేషన్. ఛాన్స్ వస్తే చూపిస్తానని మెహబూబ్ చెబుతున్నాడు. తరువాత అభి, మోనాల్‌ల మధ్య నన్ను మానిప్యులేటర్ అని ఎందుకు అన్నావు. నాగ్ ముందు మాట్లాడిన విషయాన్ని కూడా అభి తీశాడు. నేను నీ గురించి ఎప్పుడూ ఎందుకు మాట్లాడతానని ప్రశ్నించాడు. తరువాత అఖిల్ కూడా వచ్చి కూర్చొని అభి, మోనాల్‌ల మధ్య ప్రాబ్లమ్‌ని సార్టవుట్ చేయడానికి ప్రయత్నించాడు. అభి, మోనాల్‌ల మధ్య చర్చలో అభినే అఖిల్ సపోర్ట్ చేయడం విశేషం.
ఇంటి సభ్యులు బిగ్‌బాస్ పిలిచిన క్రమంలో కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లాలి. మొదటగా బిగ్‌బాస్.. అభి, హారికను పిలిచారు. కొన్ని జంటల పిక్స్ బోర్డ్‌పై పెట్టి కొన్ని బోర్డులను టేబుల్‌పై ఉంచారు. ఆ జంటను బోర్డుతో మ్యాచ్ చేయాలి. అభి, హారికలిద్దరూ.. గజిబిజి జంటను అమ్మ రాజశేఖర్, లాస్యలకు ఇచ్చారు. తరువాత సొహైల్, మెహబూబ్ వచ్చారు. వీరిద్దరూ బద్దకస్తుల జంటను అవినాష్, అరియానాలకు ఇచ్చారు. తరువాత వచ్చిన మోనాల్, అఖిల్‌ల జంట.. సొహైల్, మెహబూబ్‌లకు అబద్దాల కోరు అనే ట్యాగ్ ఇచ్చారు. తరువాత వచ్చిన అవినాష్, అరియానాల జంట.. అహంకారుల జంట అనే ట్యాగ్‌ను ఇచ్చారు. ఫైనల్‌గా వచ్చిన అమ్మ రాజశేఖర్, లాస్యల జంట.. చివరిగా మిగిలిన జీరో టాలెంట్ అనే ట్యాగ్‌ను అభి, హారికలకు ఇచ్చారు. తరువాత బిగ్‌బాస్ చాలా పెద్ద ఫిట్టింగే పెట్టారు. సీక్రెట్‌గా జరిపిన ట్యాగ్స్ అన్నింటినీ పంపించి ఎవరెవరు ఏ ట్యాగ్‌ను ఏ జంటకు ఇచ్చారో వారి మెడలో వేయాలని సూచించారు. ఇక ఇంటి సభ్యులంతా తమకు లభించిన ట్యాగ్స్ సరైనవి కావు అని ప్రూవ్ చేసుకోవడానికి ఓ అవకాశం ఇచ్చారు. ఒక్కో జంటకు ఒక్కో టాస్క్ ఇచ్చారు.
అబద్దం అనే ట్యాగ్ తనకెందుకిచ్చావని సొహైల్ వెళ్లి అఖిల్‌ని నిలదీశాడు. నాకొకటి చెప్పావు.. మోనాల్‌కి మరొకటి జోడించి చెప్పావని అఖిల్ చెప్పాడు. అది అబద్దమెలా అవుతుందని సొహైల్ ప్రశ్నించాడు. నేను గేమ్ ఆడుతున్నానని అఖిల్ చెప్పాడు. ఇక నుంచి నేనూ గేమ్ ఆడతానని సొహైల్ చెప్పాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆ ట్యాగ్ ఇచ్చి అఖిల్ నిజానికి మంచి స్నేహితుడిని కోల్పోయాడేమో అనిపించింది. అఖిల్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవడంతో సొహైల్ ఓదార్చాడు. బద్దకపు జంట గిన్నెలన్నీ తోమారు.. అబద్దాల జంట.. అమ్మ రాజశేఖర్ గురించి నిజం చెప్పింది. అహంకారపు జంటకు కోపం తెప్పించేందుకు హౌస్మేట్స్ అంతా బాగా ట్రై చేశారు. తరువాత బిగ్‌బాస్ ఇంటి ప్రయాణం మొదలై 55 రోజులు పూర్తయిన సందర్భంగా ఓ వీడియోను బిగ్‌బాస్ ప్లే చేశారు. అది చూసిన కంటెస్టెంట్లంతా బాగా ఎమోషనల్ అయ్యారు. అభి, అవినాష్‌లు కెమెరా ముందుకు వచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు. తరువాత అభి, మోనాల్, అఖిల్‌లు ముగ్గురూ కలిసి హగ్ చేసుకోవడం.. ఎమోషనల్ అవడం.. షోకే హైలైట్‌గా అనిపించింది. ముగ్గురూ చాలా సందడిగా మాట్లాడుకున్నారు. ఇక అరియానా.. ఎందరున్నా ఒంటరిగా అనిపిస్తోందని ఫీలవుతుంటే అవినాష్ ఓదార్చాడు. మొత్తం మీద షో సందడిగా.. ఎమోషనల్‌గా సాగిపోయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com