అబ్బాయితో అమ్మాయి మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
తారాగణం - నాగశౌర్య, పల్లక్ లల్వాని, మోహన్, రావు రమేష్, ప్రగతి, తులసి తదితరులు
సంగీతం - ఇళయరాజా
సినిమాటోగ్రఫీ - శ్యామ్ కె.నాయుడు,
ఎడిటర్ - ఎస్.ఆర్.శేఖర్
నిర్మాతలు - వందలన అలేఖ్య జక్కం, కిరిటీ పోతిని, శ్రీనివాస్ సమ్మెట
నిర్మాణ సంస్థలు - జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్
దర్శకత్వం - రమేష్ వర్మ
ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ముడుపెడుతూ వచ్చిన సినిమాల్లో కొన్నే మనసుకు హత్తుకుంటాయి. నాగశౌర్య, పల్లాక్ లల్వాని నటించిన అటువంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అబ్బాయితో అమ్మాయి. సినిమా ఫస్ట్ లుక్ నుండి సినిమాపై ఆసక్తి ఎర్పరిచేలా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ప్రేక్షకుడి ఆరాటాన్ని ఈ సినిమా అందుకుందా లేదా అని తెలుసుకోవాలంటే సినిమా సమీక్షలోకి వెళదాం..
కథ
అభి(నాగశౌర్య), అందరి కుర్రాళ్లలాగే అమ్మాయిల ప్రేమ కోసం ఆరాటపడుతుంటాడు. అతని తండ్రి మురళి(మోహన్) కొడుక్కి అడిగివన్నీ సమకూర్చి కావాల్సినంత స్వేచ్చనిస్తాడు. అలాంటి అభికి ఓ రోజు ఫేస్‌బుక్‌లో సమంత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తనఉ చాటింగ్ చేయాలంటే తనని చూడకూడదని కండీషన్ కూడా పెడుతుంది. సరేనన్న అభితో బాగా మాట్లాడుతుంటుంది. ఇలాంటి తరుణంలో ఓ రోజు అభి బస్‌స్టాప్‌లో ప్రార్థన(పల్లక్ లల్వాని)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్లానింగ్‌తో ఆమె మనసులో చోటు సంపాదిస్తాడు. అయితే ప్రార్థనకి తండ్రి (రావు రమేష్) అంటే ఓ భయం ఉంటుంది. అభి తన ప్లానింగ్‌తో ప్రార్థన ప్యామిలీని తన గేటెడ్ కమ్యూనిటీకే రప్పిస్తాడు. ఆమె చేత ఐలవ్ యూ చెప్పించుకుంటాడు. ఓ సందర్భంలో ఇద్దరూ ఒకటవుతారు. ఇది తెలిసిన అభి తల్లిదండ్రులు, ప్రార్థన తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష
నాగశౌర్య లవర్ బోయ్ పాత్రలో చక్కగా నటించాడు. అమ్మాయిని ట్రాప్ చేసేటప్పుడు అమాయకుడుగా వేసే వేసం, నార్మల్‌గా సినిమాలో ఎనర్జిటిక్‌గా కనిపించే సందర్భంలో చక్కగా వేరియేషన్ చూపించాడు. తన నటనలో మెచ్యూరిటీ కనపడింది. పల్లక్ లల్వాని లుక్ పరంగా అక్కడక్కగా కామ్నజెఠ్మలానీని గుర్తుకు తెచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ఇంకా బెటర్ కావాల్సి ఉంది. మోహన్, తులసి, రావు రమేష్, ప్రగతి ఇలాంటి పాత్రలను ఎన్నింటినో చేయడం వల్ల సులువుగా చేసేశారు. బ్రహ్మానందం క్యారెక్టర్ అలా కనపడి ఇలా వెళ్ళిపోతుంది. ఆ పాత్రనెందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి. ఇళయరాజా మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మంచి లవ్ స్టోరీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి ఫీల్ ఉన్న లవ్ స్టోరీని అందించాడు. పాటలు వినడానికే కాదు, పిక్చరైజేషన్ కూడా బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ. ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా, ప్రెష్‌గా చూపించాడు. ఎస్.ఆర్.శేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. బ్రహ్మానందం కనపడేలాంటి కొన్ని సీన్స్ అనవసరం అనిపిస్తాయి. కామెడి కనపడదు. ఎదో అక్కడక్కడా మాత్రం కామెడి టచ్ కనపడతుంది. లవ్ ఫీల్ ఇంకాస్తా డెప్త్‌గా ఉండుంటే బావుండెదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్ బావుంది. డైలాగ్స్, టచ్ అయ్యే స్థాయిలో లేవు.
విశ్లేషణ
హీరో హీరోయిన్స్ ప్రేమించుకోవడం,విడిపోవడం, మళ్ళీ ప్రేమించుకోవడం అనే పాయింట్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాను దర్శకుడు డ్రైవ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సోషల్ మీడియాను ఇప్పటి యువత ఎలా ఉపయోగించుకుంటున్నారు. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే పాయింట్ కూడా టచ్ చేశాడు. లవ్ ఎంటర్‌టైనర్‌కు కామెడి కాస్తా జోడించి ఉంటే ఇంకా బావుండేది. సినిమాటోగ్రఫీ, ఇళయరాజా మ్యూజిక్ సినిమాకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. నాగశౌర్య నటన, పల్లక్ లుక్ సినిమాకు కొత్తదనాన్ని అపాదించాయి.
బాటమ్ లైన్: అబ్బాయితో అమ్మాయి` గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments