'అబ్బాయితో అమ్మాయి' టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా 'అబ్బాయితో అమ్మాయి'. కిర‌ణ్ స్టూడియోస్‌, జె.బి.సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వంద‌న అలేఖ్య జ‌క్కం, కిరీటి, శ్రీనివాస్ నిర్మాత‌లు. ఈ సినిమాలో నాగ‌శౌర్య‌, పాల‌క్ అల్వాని జంట‌గా న‌టిస్తున్నారు. ర‌మేష్ వ‌ర్మ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో నాగ‌శౌర్య మాట్లాడుతూ ''నాతో ఈ సినిమా చేయ‌డానికి ర‌మేష్‌వ‌ర్మ‌గారు రెండేళ్లు వెయిట్ చేశారు. ఆయ‌న న‌న్ను చూసిన త‌ర్వాత రాసిన క‌థ ఇది. ఇళ‌య‌రాజాగారితో ప‌నిచేయ‌డం నా అదృష్టం'' అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ ''అద్భుత‌మైన క‌థ‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు ద‌ర్శ‌కుడు. మంచి సంగీత ద‌ర్శ‌కుడితో ప్ర‌యాణం చేయ‌డం ఆనందంగా ఉంది. మంచి హిట్ మూవీ అవుతుంది'' అని తెలిపారు. ప్రేమ‌క‌థా చిత్రాల్లో ఇదో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంద‌ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు చెప్పారు.