'అబ్బాయితో అమ్మాయి' లవ్ స్టోరీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది
- IndiaGlitz, [Sunday,November 01 2015]
నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరిస్తూ మోహనరూపా ఫిలింస్ తో కలిసి జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది.
డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. నవంబర్ 2న రీ-రికార్డింగ్ ప్రారంభించనున్నారు.ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా సంగీతం అందించారు. నవంబర్ 2 నుంచి 6 వరకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, వరంగల్ లో ఒక్కో పాటను ఆవిష్కరించనున్నారు. మొత్తం పాటలను 7న హైదరాబాద్ లో జరగనున్న ఆడియో వేడుకలో ఆవిష్కరించనున్నారు. అత్యంత వైభవంగా జరగబోయే ఈ వేడుకలో ఇళయరాజా పాల్గొంటారు. డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నమైన లవ్ స్టోరీతో హార్ట్ టచింగ్ గా సాగే చిత్రం ఇది. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ మాస్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. రమేశ్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. చాలా ట్రెండీగా, పొయిటిక్ గా తీశారు. ఆయనకు మంచి విజన్ ఉంది. ఇళయరాజా స్వరపరచిన పాటలు ఓ హైలైట్. రెండు పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించాం. నాగశౌర్య టైలర్ మేడ్ పాత్ర చేశాడు. తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. కథానాయిక పల్లక్ లల్వాని అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. లవ్ స్టోరీస్ లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచే చిత్రం అవుతుంది'' అని చెప్పారు.