'అబ్బాయితో అమ్మాయి' బిజినెస్ అదిరిందట..

  • IndiaGlitz, [Saturday,August 15 2015]

ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది. అదే ఓ అప్ కమింగ్ హీరో సినిమా అయితే... బిజినెస్ అవ్వడానికి నానా తంటాలు పడాల్సిందే. కానీ, 'అబ్బాయితో అమ్మాయి' అనే చిత్రం విషయంలో ఇది రివర్శ్ లో జరిగింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఈలోపు నాలుగు జిల్లాల్లో బిజినెస్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాకి ఇలా జరగడం సంచలనమే. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరు అంటే.. 'నాగశౌర్య'. హీరోయినేమో ముంబై భామ పాలక్ లల్వాని. దర్శకుడేమో రమేశ్ వర్మ. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎప్పుడు మొదలుపెట్టారో కానీ సైలెంట్ గా టాకీ పార్ట్ కూడా పూర్తి చేసేశారు. ఇక, పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. రేపు (15.08.) ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం వైజాగ్ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ 63లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. కృష్ణ, గుంటూరు, వెస్ట్ ఏరియాల్లో కూడా బిజినెస్ పూర్తి కావడం విశేషం. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా పాటలు స్వరపరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకుంటున్నారు.

More News

'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ‘మిర్చి’ ఫేమ్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

'సైజ్ జీరో' ఆ చిత్రంలా ఉంటుందా...?

అనుష్క ప్రధానపాత్రలో ‘బాహుబలి’, ‘రుద్రమదే’వి చిత్రాల తర్వాత ‘ చేస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. పివిపి బ్యానర్ పై

ఎగ్జయిట్ అయిన పవన్ కళ్యాణ్...

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘సర్ధార్’ సినిమాలో నటిస్తూ బిజీగా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న 'టెర్రర్‌'

అఖండ భారత్‌ క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమా సమర్పణలో శ్రీకాంత్‌, నిఖిత హీరో హీరోయిన్‌లుగా సతీష్‌ కాసెట్టి

17 నుంచి విదేశాల్లో 'శివమ్'

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'శివమ్'. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథతో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.