ఇళయరాజా 'అబ్బాయితో అమ్మాయి'
Send us your feedback to audioarticles@vaarta.com
రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. జేజి సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్స్ మోషన్ పిక్చర్స్, మోహన్ రూపా ఫిలింస్ సంస్థలు నిర్మించిన చిత్రం 'అబ్బాయితో అమ్మాయి'. నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మించిన ఈ చిత్రానికి ఇళయరాజా పాటలు స్వరపరిచారు.
ఈ చిత్రం పాటలను ఈ నెల నవంబర్ 18, బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇళయరాజా బిగ్ సీడీ, ఆడియో సీడీలను విడుదల చేశారు. హీరో నాగశౌర్య తల్లి ఉష, హీరోయన్ పల్లక్ లల్వాని తల్లి దీపికా లల్వాని థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా..
ఇళయరాజా మాట్లాడుతూ `ప్రతి ఒక్కరికీ ప్రేమంటే ఇష్టం. అందరూ ప్రేమలోనే ఉంటారు. నాకు సంగీతమంటే ప్రేమ, కొందరికీ డబ్బంటే ప్రేమ. ఇలా ప్రతి ఒక్కరూ ప్రేమలో ఉంటారు. రమేష్ వర్మ, నిర్మాతలు ప్రేమతో నిర్మించిన అబ్బాయితో అమ్మాయి మంచి విజయాన్ని సాధించాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ `రమేష్ వర్మగారిని నేను అన్నయ్య అని పిలుస్తుంటాను. ఊహలుగుసగుసలాడే సినిమా కంటే ముందే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తానని ఈ కథను రాసుకున్నారు. అయితే అప్పట్లో కొన్ని కారణాల వల్ల సినిమా చేయడానికి వీలు పడలేదు. ఇప్పుడు కుదిరింది. ఇళయరాజాగారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన గురించి మాట్లాడేటంత పెద్దవాడిని కాను. నా కెరీర్ స్టారింగ్ లోనే ఆయన మ్యూజిక్ లో సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు.
రమేష్ వర్మ మాట్లాడుతూ ''నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు. అదే రియల్ వరల్డ్ కు వచ్చేసరికి ఈ ఓపెన్ నెస్ ఉండటంలేదు. ఈ రెండు ప్రపంచాల మధ్య కన్ ఫ్యూజన్ తో సాగే యువతరం జీవితాన్ని, ప్రస్తుత ట్రెండ్ ని ఆవిష్కరించే చిత్రమిది. ఇళయరాజాగారికి థాంక్స్. నాగశౌర్య, పల్లక్ లల్వాని సహా సపోర్ట్ చేసిన అందరకీ థాంక్స్`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రస్తుతం వస్తున్న ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నమైన లవ్ స్టోరీతో హార్ట్ టచింగ్ గా సాగే చిత్రం ఇది. ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ మాస్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఉంటుంది. రమేశ్ వర్మ అద్భుతంగా తెరకెక్కించారు. చాలా ట్రెండీగా, పొయిటిక్ గా తీశారు. ఆయనకు మంచి విజన్ ఉంది. ఇళయరాజా స్వరపరచిన పాటలు ఓ హైలైట్. రెండు పాటలను స్విట్జర్లాండ్ లో చిత్రీకరించాం. నాగశౌర్య టైలర్ మేడ్ పాత్ర చేశాడు. తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుంది. కథానాయిక పల్లక్ లల్వాని అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. లవ్ స్టోరీస్ లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచే చిత్రం అవుతుంది. సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం. అలాగే అబ్బాయితో అమ్మాయి సినిమాకు కో డైరెక్టర్ గా పనేసిన రమేష్ దర్శకత్వంలో వాడెవడు అనే నూతన చిత్రాన్ని సంక్రాంతి తర్వాత లాంచనంగా ప్రారంభిస్తాం. వాడెవడు చిత్రంలో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఒక హీరోగా నటిస్తాడు. మరో హీరో ఎవరనేది తెలియజేస్తాం. ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమానికి సి.కళ్యాణ్, బెల్లంకొండ సురేష్, సాయికొర్రపాటి, అవసరాల శ్రీనివాస్, హీరో గౌతమ్, నల్లమలుపు బుజ్జి, నందినీ రెడ్డి, రావు రమేష్, దాసరి కిరణ్ కుమార్, ఆర్.పి.పట్నాయక్, లగడపాటి శ్రీదర్, శ్రేలేఖ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments