అబ్బాయితో అమ్మయికి మంచి స్పందన - రమేష్ వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన అబ్బాయితో అమ్మాయి జనవరి 1న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని రమేష్ వర్మ చెప్పారు. నాగశౌర్య, పలక్ లల్వాని కలిసి నటించిన సినిమా ఇది. ఈ సినిమా గురించి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగశౌర్య, రమేష్ వర్మ, పలక్ లల్వాని, శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొడాలి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రమేష్ వర్మ మాట్లాడుతూ ``సినిమాను పెద్ద హిట్ చేసిన వారికి ధన్యవాదాలు. మాకు అన్ని ఏరియాల నుంచీ మంచి స్పందన వస్తోంది. కలెక్షన్లు క్రమేణ పెరుగుతున్నాయి. సినిమాను ఇంకా ఆదరిస్తారనే నమ్మకం ఉంది`` అని అన్నారు.
నాగశౌర్య మాట్లాడుతూ ``మంచి సినిమాను ఇచ్చిన రమేశ్ గారికి థాంక్స్. ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ ధన్యవాదాలు. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. మా సినిమాను థియేటర్లలోనే చూడండి`` అని చెప్పారు.
కలెక్షన్లు స్టడీగా ఉన్నాయని శాస్త్రి అన్నారు.
మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉందని పలక్ లల్వాని చెప్పారు.
కొత్త ఏడాదిలో మంచి సక్సెస్‌ను చవిచూసినందుకు ఆనందంగా ఉందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత మురళీకృష్ణ కొడాలి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments