బాబాయ్ టైటిల్ తో అబ్బాయ్.....
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ, సుహాసిని నటించిన మంగమ్మగారి మనవడు సినిమాలో దంచవే మేనత్త కూతురా.. అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ సాంగ్‌ను నాని హీరోగా రూపొందిన రైడ్ చిత్రంలో రీమిక్స్ కూడా చేశారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇదే టైటిల్ అంటే దంచవే మేనత్త కూతురా...అనే టైటిల్‌తో కల్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని, ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తారని ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఇంట్లో దెయ్యం నాకేం భయం అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత దంచవే మేనత్త కూతురా..సినిమా రూపొందనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com