అబ్బాయికి ఓకే.. బాబాయ్ పరిస్థితేంటి?
Send us your feedback to audioarticles@vaarta.com
సరిగ్గా ఏడాది క్రితం ఏ తేదిన ఓ స్టార్ హీరో చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిందో.. సరిగ్గా అదే తేదికి ఈ సంవత్సరం అదే ఫ్యామిలీకి చెందిన మరో స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాస్తంత వివరాల్లోకి వెళితే..
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించగా గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజైంది. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బ్లాక్‌బస్టర్ చిత్రాల జాబితాలో చేరింది.కట్ చేస్తే.. బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం 'పైసా వసూల్' ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి అబ్బాయ్‌కి అచ్చొచ్చిన విడుదల తేది.. సరిగ్గా ఏడాది తరువాత బాబాయ్‌కి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com