అక్టోబర్ 18న 'ఆవిరి'
Send us your feedback to audioarticles@vaarta.com
`అల్లరి`, `నచ్చావులే`, `అనసూయ`, `అవును`, `అవును 2` ..వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో దర్శకుడిగా రవిబాబు తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు . ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ఆవిరి`. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత రవిబాబు మాట్లాడుతూ `` రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా,థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments