జూలై 14న 'ఆట‌గ‌ద‌రా శివ‌' విడుద‌ల‌

  • IndiaGlitz, [Wednesday,June 20 2018]

'ప‌వ‌ర్‌', 'లింగా', 'బ‌జ‌రంగీ భాయీజాన్‌' వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం 'ఆట‌గ‌ద‌రా శివ‌'. రాక్‌లైన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందిస్తున్నారు.  'ఆ న‌లుగురు', 'మ‌ధు మాసం', 'అంద‌రి బంధువ‌య‌'తో ప్రేక్ష‌కుల భావోద్వేగాల‌ను స్పృశించిన సెన్సిటివ్‌ ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఉద‌య్ శంక‌ర్ క‌థానాయ‌కుడు. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. 'స‌మ‌యానికి వ‌చ్చేది దేవుడు కాదు... య‌ముడు' అనే డైలాగ్‌తో మొద‌లైన ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

హీరో ఉద‌య్‌శంక‌ర్ మాట్లాడుతూ '' ఉరిశిక్ష నుంచి త‌ప్పించుకుని ఓ ఖైదీ బ‌య‌ట‌ప‌డ‌తాడు. అనుకోకుండా త‌న‌ను ఉరితీయాల్సిన తలారినే క‌లుస్తాడు. వాళ్లెవ‌ర‌న్న విష‌యం ప‌ర‌స్ప‌రం తెలియ‌క‌పోవ‌డంతో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఆ ప్ర‌యాణంలో వాళ్ల‌కు ఎదుర‌య్యే అనుభ‌వాలు ఏంటి?  వాళ్లు ఎవ‌రెవ‌రిని క‌లిశారు? అనేది మా సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం. క‌థానాయ‌కుడిగా నా తొలి చిత్ర‌మిది. చిన్న‌ప్ప‌టి నుంచి పుస్త‌కాలు బాగా చ‌దివేవాడిని. నా ఊహ‌ల‌కి త‌గ్గ క‌థ ఇది. ఈ క‌థ‌తో ప‌రిచ‌య‌మ‌య్యే అవ‌కాశం ల‌భించినందుకు ఆనందంగా ఉంది. న‌చ్చిన క‌థ దొర‌క‌డంతో  పాత్ర కోసం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా. ఖైదీగా క‌నిపించాలని 11 నెల‌ల పాటు గ‌డ్డం, మీసాలు పెంచా.

ద‌ర్శ‌కుడు చేసిన స‌పోర్ట్ ని మ‌ర్చిపోలేను. నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్‌గారు నన్ను హీరోని చేస్తాన‌ని మాటిచ్చారు. ఆ మాట ప్ర‌కారం ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. దొడ్డ‌న్న క‌న్న‌డ‌లో అగ్ర‌న‌టుడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో క‌థానాయ‌కుడిగా నాకు చాలా మంచి పేరు వ‌స్తుంది. భావోద్వేగాల‌ను పండించ‌డంలో చంద్ర‌సిద్ధార్థ్ శైలి వేరు. ఆయ‌న తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులో ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది'' అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్ మాట్లాడుతూ '' జీవితంలో గ్యారంటీ అంటూ ఉందంటే అది ఒక్క చావుకే. అది తెలిసి కూడా చావంటే చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. దాన్నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఎంతో  ప్ర‌య‌త్నం చేస్తారు. మా చిత్రంలో కొద్దిసేప‌ట్లో ఉరి కొయ్య‌కి వేలాడాల్సిన ఒక ఖైదీ జైలు నుంచి త‌ప్పించుకుని ప‌రార‌వుతాడు. ఆ త‌ర్వాత ఏమైంద‌న్న‌దే క‌థ‌. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఒక‌రి నొక‌రు క‌లిసినా, విడిపోయినా దాని వెనుకున్న‌ది శివుడి లీలే అని న‌మ్ముతాం.

ఆ తాత్విక‌త‌ని స్పృశిస్తూ అల్లుకున్న క‌థ ఇది. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన 'రామ రామ రే' చిత్రాన్ని ఆధారంగా తీసుకుని  మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు తీర్చిదిద్దా. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది.  కొత్త‌ద‌నాన్ని కోరుకునే ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేసే సినిమా అవుతుంది. జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నాం'' అని చెప్పారు.

నటులు : ఉదయ శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం, చమ్మక్ చంద్ర, సందేశ్, జ్వాలా కోటి, సాహితీ, రమాదేవి తదితరులు.

More News

'పంతం' సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసిన తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

ఆదికి జోడీగా సుర‌భి

'బీరువా', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'జెంటిల్‌మన్' లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ సురభి.

రవితేజ సినిమాలో ట్విస్ట్ అదేనట..

మాస్ మహారాజా రవితేజ, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. 'ఖతర్నాక్', 'కిక్', 'దేవుడు చేసిన మనుషులు' సినిమాల తర్వాత ఈ జంట నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

'జెర్సీ'.. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా

ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఏదో ఒక ప్ర‌తిభ ఉంటుంది. కాకపోతే అది గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందిలో త‌మ‌ ప్రతిభ ఏమిటో వెంటనే తెలిస్తే..

అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి మూవీస్ సంస్థ‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. 'చిన్నోడు పెద్దోడు', 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు',